ఎంత ఎదిగినా గురువును మరవొద్దు : తెలంగాణ విద్యాశాఖ మంత్రి

సమాజ నిర్మాతలు మీరే-జాతి నిర్మాణం లో భాగస్వాములు కావాలని… భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. విద్యార్థులకు నైతిక విలువలు,మానవీయ విలువలు నేర్పించాలని… ప్రయివేటు పాఠశాలల్లో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్కూల్ డే లు నిర్వహిస్తామన్నారు. చిన్ననాడు పీర్ల కోటం లో చదువుకున్న, నాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు తనకెప్పటికి ఆదర్శమని వివరించారు. ఎంత ఎదిగిన గురువు ను మర్చిపోవొద్దని…గురుపూజ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సబితా. రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యా రంగం కూడా అందులో ఎంతో ముఖ్యమైనదని… ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థ బాగు కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. . దేశంలో ఎక్కడా లేనివిధంగా… డిజిటల్ తరగతులను తెలంగాణ లోనే నిర్వహించామన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-