దమ్ముంటే కేసీఆర్‌ని టచ్ చేయండి.. మంత్రి సవాల్

తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌కి సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బీజేపీ పాలితరాష్ట్రాల్లో రైతుబంధు ఉందా? అని ప్రశ్నించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.తెలంగాణలో వ్యవసాయభూములకు భారీగా ధరలు వచ్చాయని, అదే టైంలో ఆంధ్రాలో ధరలు ఢమాల్ అన్నాయన్నారు. ఎర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మాట్లాడుతున్నారన్నారు.

దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడండి… మా దమ్ము ఏంటో చూపిస్తాం అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రేవంత్ బుడ్డారఖాన్… సంజయ్ మెంటల్… అర్వింద్ ఏమీ లేనోడు. మధ్యప్రదేశ్ నుంచి ఒక కుక్క వచ్చి కేసీఆర్ మీద మొరిగింది. అస్సాం నుంచి వచ్చి ఇంకొకడు మొరుగుతున్నాడు. వాళ్ళ రాష్ట్రంలో ఒక ఎకరం భూమి ధర రూ.2 లక్షలు లేదు. ఇక్కడ ధర ఎందుకు పెరిగింది అంటే… పుష్కలంగా నీళ్లు, పుష్కలమైన ఉచిత కరెంట్, రైతుబంధు వల్ల భూముల ధరలు పెరిగాయి.

కేంద్రం సీరియస్‌గా ఉంది.. ఎప్పుడైనా కేసీఆర్‌ జైలుకు వెళ్ళొచ్చు : బండి

ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేది. నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారు. బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా ? తెలంగాణ వాళ్ళు బీహార్, మదే ప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారా ? బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఇట్లా ఉంది. ఇద్దరు అబద్దాలకోర్లు మొరుగుతున్నారు. ఒక్కడికి నెత్తి మీద ఉన్నది. లోపల లేదు. నిజామాబాదోడికి నెత్తిమీద లేదు, లోపల కూడా లేదు. రైతుబంధు, సాగునీరు మీ పాలిత రాష్ట్రంలో ఇస్తున్నారా? నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. అర్వింద్, సంజయ్ రాజీనామా చేస్తారా ? సవాల్ స్వీకరించాలన్నారు ప్రశాంత్ రెడ్డి.

గెలిచిన 5 రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని మాటతప్పిన సిగ్గులేనివాడు అర్వింద్. సిగ్గులేకుండా ఇంకా గ్రామాల్లో తిరుగుతున్నాడు. దేశ వ్యవసాయ మంత్రి పసుపుబోర్డు ఇవ్వాలని చెప్పిన వెంటనే బాయిల బండ కట్టుకొని చచ్చిపోవాలి. నేనైతే అదే పని చేస్తుంటి. ఆంబోతు లెక్క ఊర్ల మీద పడి అర్వింద్ తిరుగుతున్నడు. కేసీఆర్ ను జైళ్లో పెడతా అంటున్న వెధవల్లారా దమ్ముంటే విచారణ చేయండి. జైల్లో పెడతామని ఏడాది నుంచి మొరుగుతున్నారు. ఎవరి జైలు కు పొయిండ్రో గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ ను టచ్ చేసి చూడండి. ఏమైతదో చూడండి. ఇక నుంచి ఊరుకునేది లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

Related Articles

Latest Articles