బస్ టిక్కెట్ రేట్లు పెంచినట్టు.. సినిమా టిక్కెట్ రేట్లు పెంచొచ్చు కదా!

ఏపీ మంత్రి పేర్నినాని సినీ ప్రముఖులతో నేడు సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఆదిశేషగిరిరావు, యువి క్రియేషన్స్ వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి. కళ్యాణ్, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, పంపిణీదారులు ఎల్వీఆర్, సత్యనారాయణ, వీర్రాజు, అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబుతో పాటు పలువురు థియేటర్ల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఓ సినిమా థియేటర్ యజమాని సినిమా టిక్కెట్ రేట్ల పెంచకూడదన్న అంశంపై తమ అభిప్రాయాన్ని చెప్పారు. అయితే సినిమా టిక్కెట్ల ధరలు పెంపుదల లేకుంటే నిర్వహాణ కష్టసాధ్యమవుతోందని సదురు థియేటర్ ఓనర్ తెలిపారు. పండుగ సీజన్లో ఆర్టీసీ బస్ టిక్కెట్ రేట్లు పెంచినట్టు.. సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వచ్చు కదా అని థియేటర్ యజమాని అడిగాడు.

కాగా, దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. ‘ఆర్టీసీ వ్యవస్థతో సినిమా థియేటర్లను పోల్చడం సరి కాదన్నారు. ఆర్టీసీకి వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల సౌకర్యం కోసం వాళ్ల గమ్యస్థానాల్లో వారిని దింపి ఖాళీ బస్సులను వెనక్కు తెస్తున్నామన్న విషయం మీకు తెలుసా అంటూ మంత్రి నాని గుస్సాయ్యారు. ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించకుంటే.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని’ మంత్రి పేర్ని స్పష్టం చేశారు. టిక్కెట్ల ధరల పెంచమని అడగానికి ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని థియేటర్ యజమానిని సహచరులు తప్పుపట్టారు.

-Advertisement-బస్ టిక్కెట్ రేట్లు పెంచినట్టు.. సినిమా టిక్కెట్ రేట్లు పెంచొచ్చు కదా!

Related Articles

Latest Articles