చట్టప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు: మంత్రి పేర్ని నాని

టాలీవుడ్‌లో నెలకొన్ని సినిమా టిక్కెట్ ధరలపై మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1955 సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 1955 నుంచి అదే జరుగుతోందని… తాము కొత్తగా సృష్టించిందేమీ లేదన్నారు. రామ్‌గోపాల్ వర్మ తాను చెప్పాల్సింది చెప్పారని.. అన్నీ వివరంగా విన్నానని తెలిపారు.

Read Also: రేట్ల తగ్గింపుతో సినిమా క్వాలిటీ దెబ్బతింటుంది: ఆర్జీవీ

ప్రభుత్వ నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే సినిమా టికెట్ రేట్ల అంశానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటైందని.. ఆ కమిటీ సూచనల ప్రకారం ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి వివరణ ఇచ్చారు. కమిటీ మంగళవారం కూడా సమావేశమవుతుందని… రేట్లు సరిపోవడం లేదని ఎవరికైనా అనిపిస్తే కమిటీ ముందు చెప్పొచ్చన్నారు. కోవిడ్ వల్ల సినిమా హాళ్లలో 50 శాతం మాత్రమే అనుమతి ఉంటుందని… దీనికి అందరూ సహకరించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.

Related Articles

Latest Articles