ఇక చంద్రబాబు తప్పుకోవాలి.. టీడీపీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలి..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది.. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది అధికార పార్టీ.. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇక, కుప్పంలో కూడా వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికలపై ఫలితాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో వైసీపీ ఒక జిల్లాకు‌, మున్సిపాలిటీ కి పరిమితం కాలేదని స్పష్టమైందన్నారు.. ఇక, చంద్రబాబుకి సర్పంచ్‌ ఎన్నికలే దిక్కన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయవాణి హైస్కూల్ ను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని విమర్శించిన ఆయన.. ప్రజలు ఛీ కొట్టిన తర్వాత ఇంకా చంద్రబాబు కుప్పం గురించి మాట్లాడతారని నేననుకోను అన్నారు.

Read Also: ఇది సీఎం జగన్‌ ప్రభంజనం.. టీడీపీ ఆఫీసు ఇక అద్దెకే..!

మరోవైపు తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబుది కాదు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. సొంత నియోజకవర్గంలోనే మూలాలు పోయిన తర్వాత ఇంకా చంద్రబాబు కొనసాగటం కరెక్ట్‌ కాదన్న ఆయన.. చంద్రబాబు తప్పుకుని పార్టీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించడం మంచిదని సూచించారు.. నా మీద చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ చాలా దుర్భాషలాడారని గుర్తుచేసుకున్న ఆయన.. నేను 17వ తేదీన మాట్లాడతానని ఆ రోజే చెప్పానన్నారు.. మరోవైపు, చంద్రబాబు పుంగనూరు వచ్చి పోటీ చేస్తానంటే నేను ఆహ్వానిస్తానన్నారు మంత్రి పెద్దిరెడ్డి… చంద్రబాబు నా మీద పోటీ చేస్తారేమో ఆయన్నే అడగండి అంటూ మీడియాకు సూచించారు.

Related Articles

Latest Articles