2023 మార్చి నాటికి భూ రక్ష సర్వే పూర్తి-మంత్రి పెద్దిరెడ్డి

2023 మార్చి నాటికి భూ రక్ష సర్వే పూర్తి చేస్తామని తెలిపారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై ఇవాళ మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ధర్మానలు అధికారులతో భూ రక్ష పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు.. అ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ఇసుక రీచుల తరహాలోనే మైనింగును ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే అంశంపై ఆలోచన చేస్తున్నాం అన్నారు.. దీనికి ఆర్ధిక, న్యాయ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు.. విశాఖ, తిరుపతి, విజయవాడ నగరాల్లో స్వాధీనం చేసిన ల్యాండ్ సీలింగ్ భూములపై కూడా చర్చించామన్న ఆయన.. వైఎస్సార్ శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించాం.. అన్ని రకాల భూములను సర్వే చేయనున్నామని వెల్లడించారు.. కొన్ని ఇబ్బందులున్నాయి వాటినీ అధిగమిస్తామన్న పెద్దిరెడ్డి.. 2023 మార్చి నాటికి భూ రక్ష సర్వే పూర్తి చేయనున్నట్టు తెలిపారు.. భూ తగాదాలు.. ఈనాం భూముల సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు జరుగుతోందని.. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలోనే సర్వే చేపడుతున్నామని.. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల పర్యవేక్షణలోనే ఈ సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.

Related Articles

Latest Articles

-Advertisement-