అన్నదాతలు సుభిక్షంగా ఉంటే సమాజం బాగుంటుంది: మంత్రి నిరంజన్‌రెడ్డి

ఇతర రాష్ట్రాల పల్లెల కన్నా తెలంగాణ పల్లెలు నేడు బాగున్నాయని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వననపర్తి జిల్లాలోని గోపాల్‌పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఉన్న ఎంజే 1 కాలువను పరిశీలించి కృష్ణా జలాలకు పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే సమాజం బాగుంటుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు. రైతులు సంతోషంగా ఉండేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు ద్వారా ఎంతో మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు.

Read Also: గాలిపటాలకు ఈ దారాలను ఉపయోగిస్తే నేరం

రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వ్యవసాయ విధానాల్లో మార్పులు వచ్చాయన్నారు. మనమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చామన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. మూలాలను మర్చిపోవద్దన్నారు. వనపర్తి జిల్లాకు సాగునీరు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం ఒక్క టీఆర్‌ఎస్‌నేనని మంత్రి పేర్కొన్నారు.

Related Articles

Latest Articles