టెక్నో ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి…

మల్లారెడ్డి యూనివర్శిటీ మరియు మోటివిటి ల్యాబ్స్ సహకారంతో టెక్నో ఇన్నోవేషన్ కేంద్రాన్ని మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవస్థాపక చైర్మన్ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ఉన్నత విద్య తో పాటు ఉపాది అవకాశాలు‌తో పాటు విద్యార్థులు చదువుకొంటూనే ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక పరమైన ఆలోచనలు పరస్పరం పంచుకోవడం, ఇంటర్న్ పిప్ ల ద్వారా పరిశ్రమల వాతావరణం అనుకూలంగా ఉంటేట్లు ఏర్పాటు చేస్తూ వారికి శిక్షణ అందిస్తామని ,,ఇన్నోవేషన్ & స్టార్ట్ అప్ లను ప్రోత్సహిస్తూ వారి ఆలోచనలకు వాణిజ్యీకరణ కోసం మార్గదర్శకత్వం‌ చేయడం ప్రదాన లక్షం‌ అని‌ తెలిపారు

ఇక విద్యార్థులకు అవగాహన సదస్సుతో పాటు… భవిష్యత్తు ప్రణాళికలు మరియు ఉద్యోగ అవకాశాలు గురించి వక్తలు తెలియజేసారు. యూనివర్సిటీ లో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యాను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తోపాటు మోటివిటి టెక్నో ఇన్నోవేషన్ CEO సుధీర్ తుమ్మ‌, చామకూర మహేందర్ రెడ్డి,డా” చామకూర భద్రా రెడ్డి, వైస్ ఛాన్సలర్ VSK రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles