గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటన

నేడు గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడ లో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్‌. హైద్రాబాద్ ను స్లమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెల బస్తీ… లో రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిచింది జీహెచ్‌ఎంసీ. ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించింది జీహెచ్‌ఎంసీ.

ఒక్కో డబుల్ బెడ్ రూమ్ 560 చదరపు అడుగుల విస్తీర్ణంగా ఉండగా…. మౌలిక సదుపాయాల కల్పనతో కలిపి ఒక్కొక్క డబుల్ బెడ్ రూమ్ ఇంటిని రూ. 8.65 లక్షల వ్యయంతో నిర్మించారు. అలాగే… సిసి రోడ్లు, సీవరేజ్ లైన్లు, త్రాగునీటి కై సంపు నిర్మాణం, ఐదు లిఫ్ట్ ల ఏర్పాటు, విద్యుదీకరణ లను చేపట్టారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ల నిర్వహణకు గాను 19 దుకాణాలు నిర్మించారు. చంచల్ గూడ ప్రధాన జంక్షన్ లో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మార్కెట్ లో ఒక్కొక్కటి కనీసం రూ. 40 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే… ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవాళ ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్‌.

-Advertisement-గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ మంత్రి కేటీఆర్  పర్యటన

Related Articles

Latest Articles