రేపు బాల్క సుమన్ ను పరామర్శించనున్న కేటీఆర్

చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాల్క సుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ ను టీఆర్ఎస్ నేతలు పరామర్శిస్తున్నారు. కాగా రేపు మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మెట్ పల్లిలో బాల్క సుమన్ ను కేటీఆర్ పరామర్శించనున్నారు. అనంతరం కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో కూడా కేటీఆర్ పర్యటించనున్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-