అలా చేస్తే త‌ప్పేంటి? విద్యార్థి స‌మాధానానికి కేటీఆర్ ఫిదా…

ఉద‌యాన్నే చాలా మంది చిన్నారులు పేప‌ర్ వేస్తూ క‌నిపిస్తుంటారు.  వివిధ కార‌ణాల వ‌ల‌న బాల్యం నుంచే క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సి వ‌స్తుంటుంది.  జ‌గిత్యాల ప‌ట్ట‌ణానికి చెందిన జ‌య‌ప్ర‌కాశ్ అనే విద్యార్థి ఉద‌యాన్నే పేప‌ర్ వేస్తుండ‌గా ఓ వ్య‌క్తి చ‌దువుకునే వ‌య‌సులో పేప‌ర్ ఎందుకు వేస్తున్నావ్ అని ప్ర‌శ్నించ‌గా, త‌ప్పేముంది, పేప‌ర్ వేస్తూ చ‌దువుకోకూడ‌గా అని ఎదురు ప్ర‌శ్నించారు.  చిన్న‌త‌నం నుంచి క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తూ చ‌దువుకుంటే పెద్ద‌య్యాక ఏ ప‌ని చేయాల‌న్నా క‌ష్టం అనిపించ‌దు.  అని స‌మాధానం చెప్పాడు.  దీనిని సంబందించిన వీడియోను స‌ద‌రు వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.  ఆ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ చిన్నారిని అభినందించారు.  విద్యార్థిలోని ఆత్మ‌విశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.  భ‌విష్య‌త్తులో మంచి స్థితిలో స్థిర‌ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్టు కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.  

Read: రేషన్ బియ్యం నొక్కేసి ఆఫ్రికా తరలిస్తున్న మాఫియా…!

-Advertisement-అలా చేస్తే త‌ప్పేంటి?  విద్యార్థి స‌మాధానానికి కేటీఆర్ ఫిదా...

Related Articles

Latest Articles