రాష్ట్ర మొత్తం దళిత బంధు ఇస్తాం : కేటీఆర్

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… స్వాతంత్ర్యo వచ్చిన 70 ఏళ్లలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది. 60 ఏళ్ళు మీరు ఏం చేశారు అని ప్రశ్నించారు. ఫ్లోరైడ్ తో నల్గొండ అతలాకుతలం అయింది. కాంగ్రెస్ పార్టీ పాపాలు పెరిగినట్టు ఫ్లోరోసిస్ పెరిగింది. మంచి నీటిని అందిస్తున్న కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి అని అన్నారు. జంగ్ లేదు బొంగు లేదు జంగ్ సైరన్ లేదు. మనిక్కం ఠాగూర్ కి 50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని వాళ్ళ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. టీపీసీసీ,టీబీజేపీ కేసీఆర్ పెట్టిన భిక్ష అని తెలిపారు. కేసీఆర్ లాంటి పెద్ద మనిషి పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తిన్నది అరగక చేసే పాదయాత్ర సంజయ్ ది అని తెలిపారు.

అయితే మతాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బుల కోసం ఇంకోకాయన చేసే పని. ఇంటింటికి నీరు ఇచ్చే పథకాన్ని కేంద్రం మెచ్చుకుంది. రాష్ట్ర మొత్తం దళిత బంధు ఇస్తాం. ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్పారు అని పేర్కొన్నారు.

-Advertisement-రాష్ట్ర మొత్తం దళిత బంధు ఇస్తాం : కేటీఆర్

Related Articles

Latest Articles