నేను కూడా ఓటీటీకి అభిమానినే : మంత్రి కేటీఆర్

ప్రస్తుతం దేశంలో ఓటీటీ, గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందని…తాను కూడా ఓటీటీకి అభిమానిని అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్‌ ‘ఇండియాజాయ్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టెక్నికలర్ ఇండియా కంట్రీ హెడ్, సిఐఐ నేషనల్ ఏవిజిసి సబ్ కమిటీ ఛైర్మన్ బీరెన్ ఘోష్, మొబైల్ ప్రీమియర్ లీగ్ సహ వ్యవస్థాపకులు & సీఈఓ శ్రీ సాయి శ్రీనివాస్, సినీ నటుడు సుధీర్ బాబు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2018 లో ఈ కార్యక్రమం లో పాల్గొనప్పుడే ఇది ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి కార్యక్రమం అవుతుంది అనుకున్నానని… ఇండియా లో ఇంటర్నెట్ యూజర్స్ రోజురోజుకి పెరుగుతున్నారని తెలిపారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4% పెరుగుతుంది అని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వ్యూవర్స్ కి మంచి కంటెంట్ ని ఇవ్వడం లో ఓటీటీ సత్ఫలితాలు సాధిస్తోందని… వీఎఫ్‌ఎక్స్‌ ఔట్ సోర్సింగ్ కి తెలంగాణ మంచి డెస్టినేషన్ అవుతోందని వెల్లడించారు. గత రెండేళ్లలో 10 కొత్త వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరాయని… ప్రస్తుతం హైదరాబాద్ లో 80వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా హైదరాబాద్ లో అనేక గేమ్స్ రూపొందాయని తెలిపారు. 2023 మొదటి మార్చి లోగా ఇమేజ్ టవర్ ను లాంచ్ చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు కేటీఆర్.

Related Articles

Latest Articles