మల్లారెడ్డి సవాల్‌పై స్పందించిన కేటీఆర్..

ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది… మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.. ఇక, రేవంత్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాల్‌ విసిరారు.. తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… దమ్ముంటే రేవంత్‌రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎన్నికలకు వెళ్దామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మంత్రి మల్లారెడ్డి సవాల్‌, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తొలిసారి స్పందించారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కేసీఆర్ కాలి గోటికి సరిపోనివారు ఇవాళ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. మా మల్లా రెడ్డికి జోష్ ఎక్కువ.. ఆవేశంలో మాట్లాడారన్నారు.

పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకే.. కొడంగల్ నుంచి తరిమితే.. చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు మల్కాజిగిరిలో గెలిచాడు అంటూ రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డి ముందు మంత్రి మల్లారెడ్డి సవాల్ పై మాట్లాడి.. గజ్వేల్ సభ గురించి మాట్లాడితే మంచిదన్నారు. టి.కాంగ్రెస్ ను చంద్రబాబు.. ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడని.. చిలక మనదే అయినా.. మాట్లాడిస్తున్నది మాత్రం చంద్రబాబే అన్నారు. మల్లారెడ్డి సవాల్ చేసినట్టు రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన కేటీఆర్.. గజ్వేల్ ఆడా ఈడా ఎందుకు … అక్కడే తేల్చుకో..! అని సూచించారు. నీ స్థాయి… బతుకు ఎంటో అందరికీ తెలుసు.. రేవంత్ ను ముందు పెట్టి చంద్రబాబు నడిపిస్తున్నారు.. బాబు తోలు బొమ్మ ఆటలో బొమ్మ రేవంత్ అంటూ ఎద్దేవా చేశారు. ఇక, రాజకీయాలలో అందరూ సంస్కారవంతంగా మాట్లాడాలని కోరుకుంటాం అన్నారు కేటీఆర్.. ఇప్పుడు చంద్రబాబు బినామీ టి.పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నాడని ఆరోపించిన ఆయన.. వాళ్లు మాట్లాడారు కాబట్టే మేం మాట్లాడుతున్నాం అన్నారు. మరోవైపు.. బండి సంజయ్‌ పాదయాత్రపై కేటీఆర్ కామెంట్ చేస్తూ.. ఏం చేశారని ప్రజా సంగ్రామ యాత్ర ? అంటూ ప్రశ్నించారు.. గుజరాత్ కు వరదలు వస్తే కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చింది… తెలంగాణకు ఏం ఇవ్వలేదని బండి సంజయ్ చెబుతారా? అని నిలదీశారు.. మేం డబుల్ బెడ్ కడతాం అంటే 4,5 ఎకరాలు కేంద్రం ఇవ్వదు… కానీ, రైల్వే ఆస్తులను అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు.

-Advertisement-మల్లారెడ్డి సవాల్‌పై స్పందించిన కేటీఆర్..

Related Articles

Latest Articles