కేంద్రమంత్రి పియూష్ గోయల్ ని కలిసిన మంత్రి కేటీఆర్

రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తెలంగాణ సీఎం భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే తెరాస ముఖ్య నేతలందరూ ఢిల్లీకి చేరుకున్నారు. కాగా ఢిల్లీలోనే వున్నా మంత్రి కేటీఆర్ రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కలిశారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్ కూడా వున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ ఏమన్నారంటే.. ‘రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలు ఫలాలిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్.సి.ఐకు ధాన్యం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ.. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. వాటికి మద్దతుగా కేంద్రం నిలవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ధాన్యం సమస్యలపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు మంత్రి గంగుల లేఖలు అందజేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని కేంద్రానికి మంత్రి గంగుల వివరించారు. 2020‌-21 యాసంగిలో 80-90 శాతం పారాబాయిల్డ్ రైస్ లిమిట్ పెంచవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-