రైతులందరూ కేసీఆర్‌ మాటను వినాలి: కేటీఆర్‌

రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోలు పై అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు పోటా పోటీగా ధర్నాలు చేస్తూ ఎవ్వరికి వారే మేమంటే మేము రైతుల పక్షం అని చెప్పుకుంటున్నారు. దీనిపై అధికార టీఆర్‌ ఎస్‌, ప్రతిపక్ష బీజేపీలు దాడులకు పాల్పడేంత వరకు వ్యవహారం వెళ్లింది. రైతులు రాష్ర్ట ప్రభుత్వ ప్రకటనలతో ఆత్మహత్యలు చేసు కుంటున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. టీఆర్‌ఎస్‌ మాత్రం రైతులు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే ఏం చేస్తామంటూ బీజేపీ పై ఆరోపణలు చేస్తుంది.

ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్‌ కేంద్రం పై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయదని ఆయన ప్రశ్నిం చారు. తెలం గాణ ధనం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోదా అం టూ విమర్శలు చేశారు. బీజేపీ నేతల మాటల విని రైతులు మోస పోవద్దని, సీఎం కేసీఆర్‌ చేయనున్న ప్రకటన అనుస రించి నడుచు కోవాలని ఆయన సూచించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమన్న కేంద్రం నిర్ణయాన్ని పున:సమీక్షించు కోవాలన్నారు. కాగా, ఈ వానాకాలం పంటను మొత్తం కొనుగోలు చేస్తామని, తడిచిన ధాన్యా న్ని కూడా కొనాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.

Related Articles

Latest Articles