చీకట్లో గాడ్సేని మొక్కుతారు.. బయట గాంధీని పొగుడుతారు: కేటీఆర్

బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ,సీబీఐ, ఐటీలే అన్నారు. ఢిల్లీలో కొంత మీడియా మోడీయాగా మారిందని దుయ్యబట్టారు.

నరేంద్ర మోదీ రైతు విరోధి. ప్రధాన మోడీని పంజాబ్ లో రైతులు అడ్డుకున్నారు. దేశచరిత్రలో ఏ ప్రధాన మంత్రికి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎదురు కాలేదు. సిగ్గులేని… నీతిలేనిది మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్. పీఎం కిసాన్ సమ్మన్ పథకానికి స్ఫూర్తి ఎవరు ? ఇంటింటికి నల్లా నీళ్లు అంటున్నారు ? స్ఫూర్తి ఎవరు ? మేము కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిగ్గులేని మాటలు జేపీ నడ్డా మాట్లాడారు .తెలంగాణ లో ప్రభుత్వం పై ముందు రైతులను…ఇప్పడు ఉద్యోగులను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 2022 కల్లా ఎన్నో చేస్తాం అన్నారు మోడీ కానీ ఏం చేయలేదు. ఇవన్నీ జుమ్లా అంటే…మా మీద హమ్లా. 5 లక్షల జాబ్స్ కేంద్రంలో ఉన్నాయి… వాటిని భర్తీ చేయరు. కానీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయాలని దొంగ దీక్షలు చేస్తారు. జేపీ నడ్డాది …కేర్ ఆఫ్ ఎర్రగడ్డ అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి అనే సన్నాసి ఉన్నాడు…వాడు పార్లమెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగాడు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కాళేశ్వరం లో ఎటువంటి అవినీతి లేదని చెప్పారు. మరి మీకు మతి తప్పిందా ? …మీ కేంద్ర మంత్రికి మతి తప్పిందా ? కేసీఆర్ అన్నదాతలకు ఏటీఎం అన్నారు మంత్రి కేటీఆర్.

మేకిన్ ఇండియా అని…మెడిన్ చైనా విగ్రహాలు మేము … మీలా మేం తెచ్చిపెట్టలేదు. బీజేపీ నేతలకు సిగ్గు ఉందా ? సిగ్గు …శరం..లజ్జా ఉందా?బీజేపీ నేతలకు. చీకట్లో గాడ్సే ను మొక్కుతారు…బయట గాంధీని మొక్కుతారు…బిజెపి నేతలను గాంధీ క్షమిస్తాడా?కుటుంబ పాలన గురించి జేపీ నడ్డా మాకు సుద్దులు చెబుతారు. ప్రజలతో ఎన్నుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాల్లో ఉండకూడదా? అవినీతి గురించి జేపీ నడ్డా మాట్లాడతారా ? కర్ణాటక అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రం అని తేలింది. కర్ణాటక కాంట్రాక్టర్లు పీఎం మోడీ కి అక్కడి బీజేపీ నేతల తీరుపై లేఖ రాశారన్నారు కేటీఆర్.

Related Articles

Latest Articles