దేశంలో నాలుగో మెట్రో నగరంగా హైదరాబాద్ : కేటీఆర్

దేశంలో నాలుగో మెట్రో నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించింది అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేది. హైదరాబాద్ లో ఎక్కడ, ఎలాంటి సంఘటన జరగలేదు. అందర్ని కలుపుకుని ప్రభుత్వం ముందుకు పోతుంది అని తెలిపారు. కేసీఆర్ అందర్ని సమతుల్యంగా చూస్తున్నారు. జీహెచ్ఎంసిలోని 675 స్కోయర్ మీటర్లు. 102 స్కోయర్ మీటర్ల పరిదే పాత నగరం. మౌలిక వసతుల కల్పన కోసం దృఢ సంకల్పంతో పని చేస్తున్నాం. జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో 1030 కోట్లు, హెచ్ఎండియే 2579 కోట్లు, టూరిజం 7 కోట్లు, విద్యుత్ 208 కోట్లు, పాఠశాల విద్య కోసం 108 కోట్లు మొత్తంగా 3934 కోట్లు కాంగ్రెస్ హయాంలో ఖర్చు చేశారు.

కానీ ఇక్కడ ఇప్పటి వరకు 14880 కోట్లు ఖర్చు చేశాం. ఐదు రేట్లు ఎక్కువ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేశాం. పాత నగరంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యే అయిన ఎంత ఖర్చు అయిన చేస్తాము.వివక్ష లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డబ్బులు ఖర్చు చేస్తున్నాం. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు గతంలో సీఎంను అడిగిందే తడువుగా 7 కోట్లు ఇచ్చారు అని పేర్కొన్నారు.

-Advertisement-దేశంలో నాలుగో మెట్రో నగరంగా హైదరాబాద్ : కేటీఆర్

Related Articles

Latest Articles