గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం: కొప్పుల ఈశ్వర్‌

గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పలు గరుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కరోనా అనం తరం ప్రారంభమైనా పాఠశాలల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గౌలిదొడ్డిలోని సోషల్‌ వేల్ఫేర్‌ గురుకుల బాలికల, బాలుర పాఠశాలలను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలోని తర గతి గదులు, హాస్టల్‌ భవనం, మెస్‌హాల్‌ను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివే వారికే మాత్రమే మెడికల్‌, ఇంజనీరింగ్‌ సీట్లు వచ్చేవన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్‌ అందరికీ కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిం చాలనే దిశగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. వీటిల్లో ఎంబీబీఎస్‌, ఇంజనీరింగ్‌, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ లాంటి ప్రతి ష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని తెలిపారు. గతే డాది నిర్వహంచిన నీట్‌లో సైతం విద్యార్థులు పెద్ద సంఖ్యలో విద్యా ర్థులు ర్యాంకులను సాధించారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ గుర్తు చేశారు.

Related Articles

Latest Articles