ఎన్నికల్లో గెలుపు కోసం చట్టాలు ఉపసంహరణ చేసారు : మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం హర్షణీయం. రైతుల నడ్డి విరుస్తూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ఆప్పగించేలా కేంద్రప్రభుత్వం చర్యలను సంవత్సరం క్రితమే టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి చట్టాలను వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించినప్పుడు వాటి ఫలితాలు,నష్టప్రభావం అంచనా వేయకుండా అత్యంత దారుణంగా వ్యవహిరించింది. ధీంతో 600 మంది రైతులు ప్రాణాలు వదిలారు. సంవత్సరంన్నర నుండి ఆయా రాష్ట్రాల్లో రైతు వ్యతిరేక,వ్యవసాయచట్టాలపై ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికి స్పందించారు ప్రధాన మోడీ. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో 32స్థానాల కు కేవలం 8 స్థానాలుదక్కడం, అలాగే త్వరలో 5రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం చట్టాలు ఉపసంహరణ చేసారు.

బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ అవసరాల తప్ప రైతుల బాగు కాదని,దేశ సంపద పెంపు అసలే కాదు. కేంద్రప్రభుత్వం పై ప్రజల వ్యతిరేక తో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిత్యావసర సరుకుల చట్టం సవరణ వ్యాపారులకు లాభం. పండించిన ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటూనే కనీస మద్దతు ధర లేకుండా రైతులను దళారులకు ఆప్పగించేలా చట్టాలు ఉన్నాయి. గత నెల క్రితం వరి ధాన్యం కొనుగోలు కై ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 39లక్షల ఎకరాలకు పంటసాగు చేస్తుంది. కేంద్రప్రభుత్వం అకస్మాత్తుగాధాన్యం కొనమని, వరి వేయవద్దనిచెప్పడం ఎంతవరకు సబబు. తెలంగాణ ఉద్యమం తర్వాత దేశ వ్యాప్తంగా రైతాంగాన్ని ఒక్కటి చేస్తాం అని ముఖ్యమంత్రి నిన్న మహాధర్నా లో పేర్కొనడం,ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. కేంద్రప్రభుత్వం నల్ల చట్టాలు రద్దు చేయడం టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles