ఈటల గెలిచిన ఏం లాభం లేదు : కొప్పుల ఈశ్వర్

ఈటల మాకు ఏమి సాయం చేయలే అని మీ ముదిరాజులే చెబుతున్నరు. ఈటల మంత్రిగా ముఖ్యమంత్రి అండదండలతో అంతో గింతో ఇక్కడ పని చేసిండు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కానీ ఆయనిప్పుడు ఒక వ్యక్తి మాత్రమే,మనకు వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం అని తెలిపారు మంత్రి కొప్పుల. బీజేపీ ఇంతవరకు ఏమి చేయకపోగా,మంచి పనులు చేస్తున్న మన ముఖ్యమంత్రికి అడ్డుపుల్లలు ఏస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఎంపీ బండి సంజయ్ మీ దగ్గరకు ఎన్నడూ వచ్చి ఉండడు, రూపాయి పని చేసి ఉండడు. అలాగే ఇప్పుడు ఈటల పొరపాటున గెలిచినా.. ఏం లాభం లేదు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఈటల తగ్గించలేడు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-