రాధా రెక్కీ.. మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయ కాక రేపుతోంది వంగవీటి రాధా రెక్కీ ఎపిసోడ్. ఈ కీలక అంశంపై మొదటి సారి స్పందించారు మంత్రి కొడాలి నాని. కొడాలి నాని సమక్షంలోనే తన హత్యకు రెక్కీ జరిగిందని వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు టీడీపీ నేత వంగవీటి రాధా. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకే అన్నారు నాని. వంగవీటి రాధా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

తనను హత్య చేయటానికి రెక్కీ జరిగిందని రాధా నా సమీక్షంలోనే చెప్పారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. దీంతో ముఖ్యమంత్రి వెంటనే విచారణ చేయాలని చేయాలని, భద్రత కల్పించాలని ఆదేశించారు. భద్రత కల్పించాలని రాధా నన్ను అడగలేదు, నేనూ సీఎంను అడగలేదు. గన్ మ్యాన్ లను తీసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని రాధాకు సూచించానన్నారు.

భద్రత తీసుకోవాలా వద్దా, పోలీసులకు సహకరించాలా వద్దా అన్నది రాధా వ్యక్తిగత విషయం అన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి. విచారణ జరుగుతున్న సమయంలో బాధ్యత గల మంత్రిగా నేను చంద్రబాబులా నోటికి వచ్చినట్లు మాట్లాడలేననన్నారు. వంగవీటి రాధా రెక్కీకి తగిన ఆధారాలు లభించలేదని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles