చంద్రబాబు అసెంబ్లీకి వచ్చిన చివరి రోజు ఈ రోజే: కొడాలినాని

చంద్రబాబు అసెంబ్లీకి వచ్చిన చివరి రోజు ఈరోజేనని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయంగా బతకడానికి చంద్రబాబు నీచ రాజకీ యాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం భార్యను కూడా బజారుకు ఇడ్చాడన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో జగన్‌ను ఎన్ని తిట్టించాడో గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ నుండి పార్టీ లాక్కుoటే..ఎన్టీఆర్ కూడా ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాడన్నాడు.చంద్రబాబు లాగా బయటకు వచ్చి ఏడ్వలేదన్నారు.

చంద్రబాబు సతీమణి పై ఎవరు వ్యాఖ్యలు చేశారో, ఏమని వ్యాఖ్యా నించారో ఎందుకు చెప్పటం లేదు చంద్రబాబుని ప్రశ్నిం చారు. మేము ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఆన్ రికార్డు ఉంటాయి కదా మరీ ఎందుకు చంద్రబాబు అలా చేస్తున్నారో ఆయనకే తెలియాల న్నారు. సానుభూతి కోసం మేము తన సతీమణిని వ్యాఖ్యానించినట్టు చంద్ర బాబు డ్రామా ఆడుతున్నాడన్నారు. చంద్రబాబును ఏమి చేయాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆలోచించుకోవాలన్నారు.

భార్యను కించపరుస్తు వ్యాఖ్యలు చేస్తే తాను ముఖ్యమంత్రి అవుతాను అని శపథం చేయటానికి అర్థం ఏమైనా ఉందా? గొడవ అయిన తరు వాత నవ్వుకుంటూ చంద్రబాబు సభనుంచి బయటకు వెళ్లారన్నారు. తన సభ్యులతో సమావేశం పెట్టుకుని మరో కొత్త డ్రామాకు తెర లేపా డన్నారు. ఇక చంద్రబాబు డ్రామాలు సాగవని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిదని కొడాలి నాని అన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవాడానికి ఇదొక ప్రయత్నంగా చంద్రబాబు భావించి ఉంటారని అందుకే ఇలా చేశారేమో అంటూ కొడాలి నాని ఆరోపించారు.

Related Articles

Latest Articles