ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటన దురదృష్టకరం: మంత్రి కన్నబాబు

వైఎస్ ఆర్ రైతు భరోసాలో తొలుత 45లక్షల మందికి రైతు భరోసా ప్రారంభించామని ఇప్పుడు 50.58 లక్షలపైగా రైతులకు రైతుభరోసా అందుతుందని మంత్రి కన్నబాబు అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు పండించాలని ప్రభుత్వమే కోరుతుందన్నారు. ప్రభుత్వం అసలు వరి పండించొద్దని చెబుతున్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటన దురదుష్టకర ఘటనగా మంత్రి చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎవ్వరూ చేసినా తప్పేనన్నారు. బాధ్యులపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలను వైసీపీ ఎప్పుడూ చేయదని తెలిపారు. గతంలో విజయవాడ నడిబొడ్డులో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించారన్నారు.

Read Also: డీజీపీ మహేందర్‌రెడ్డి కేసీఆర్‌కు అమ్ముడు పోయారు: అరవింద్‌

ఎన్టీఆర్ అంటే మాకు అభిమానం ఉంది..ఆయనకు సమున్నత గౌరవం ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. అమరావతి పై ప్రేమ ఉంటే.. గ్రాఫిక్స్‌లపై గతంలో చంద్రబాబును ఎందుకు బీజేపీ ప్రశ్నించలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఏంటని బీజేపీ నేతలను అడుగుతున్నన్నారు. ప్రతిపక్షాలంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు. సీబీఐ రాష్ర్టంలోకి రావొద్దని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లెటర్‌ రాసింది. వంగవీటి రాధా పై రెక్కీపై ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ సీపీ చెప్పారన్నారు. వంగవీటి రాధా అంశాన్ని చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు.

Related Articles

Latest Articles