వ్యవసాయంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలోఉంది: మంత్రి కన్నబాబు

వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా పేరుతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వైసీపీ అని చెప్పారు. రైతుల కోసం అనేక ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు.ఎరువులకు ఇబ్బంది లేకుండా మిగులు నిల్వలతో రైతుల కోసం ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అన్నారు.

Read Also: ఏపీలో కొత్తగా 1257 కరోనా కేసులు

వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చూడలేక చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామ సచివాలయ వార్డు ఉద్యోగులు సమ్మెకు దిగుతామని చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్‌లోగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. జూన్‌లోపు ఎప్పుడైనా సమస్యలను పరిష్కరించవచ్చని మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు.టీడీపీ హయాంలో ఐదేళ్లయినా ఉద్యోగుల ప్రొబిషన్‌ డిక్లేర్‌ చేయలేదన్నారు.

Related Articles

Latest Articles