శ్రమదానం చేయటంలో పవన్ ది కొత్త ట్రెండ్…

పవన్ కళ్యాణ్ లాగా శ్రమ దానం చేయటంలో ఇదొక కొత్త ట్రెండ్ అని మంత్రి కన్నబాబు అన్నారు. సరిగ్గా ఒక నిమిషం 8 సెకన్లు శ్రమదానం పేరుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆయనది కెమెరా, యాక్షన్ లాంటి వైఖరి కాదా అని అన్నారు. మహాత్మా గాంధీ జయంతి రోజున వైసీపీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అనటం ఆశ్చర్యం కలిగించింది. వైసీపీ మీద యుద్ధం దేని కోసం ప్రకటించారు. కోవిడ్ కష్టకాలంలో కూడా లక్ష కోట్ల రూపాయలు నేరుగా పేదవారి ఖాతాల్లో జమ చేసినందుకు యుద్ధం ప్రకటించారా… లేదా నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు అందించేందుకు జగన్ తాపత్రయ పడుతున్నందుకు యుద్ధం ప్రకటించారా… గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున జగన్ కు మద్దతు ఇస్తున్నందుకు యుద్ధం ప్రకటించారా అని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కడుపు మంటగా ఉంది. ఏ స్థాయి యుద్ధం కావాలని ప్రశ్నించటం గాంధీ మాటలా? గాడ్సే మాటలాఅని అడిగారు.

అయితే కుల, మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తానని 2014లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్… ఇప్పటి వరకు ఒక్కసారైనా కులం పేరు ఎత్తకుండా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడుతున్న మాటలు, ఎవరు మాట్లాడిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని వర్గ శత్రువుగా చూస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో చంద్రబాబుతో కలిసి పని చేస్తారని సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. 2014లో బహిరంగంగా, 2019లో లోపాయకారిగా చంద్రబాబుతో చేతులు కలిపారు. కులాలను ఎగదోసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తే ప్రజలు సహించరు అని పేర్కొన్నారు మంత్రి కన్నబాబు.

-Advertisement-శ్రమదానం చేయటంలో పవన్ ది కొత్త ట్రెండ్...

Related Articles

Latest Articles