రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు : మంత్రి కన్నబాబు

వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులపై సీఎం సమీక్షించారు. 16343 కోట్లతో ప్రతి గ్రామంలో మల్టి పర్పస్ ఫెసిలిటీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటి ఏర్పాటును వేగంగా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు దేశం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. రైతు భరోసా కేంద్రాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నీతి అయోగ్ పరిశీలించింది. రైతు భరోసా కేంద్రాలను మరింత సదుపాయాలు పెంచి ఐఎస్ఒ ధృవీకరణ పత్రం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని దుష్ర్పచారం జరుగుతోంది. రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాలను అభివృద్ది చేస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మంటగా ఉంది . నాణ్యతతో కూడిన ఎరువుల మందులు ఇవ్వడమే రైతు భరోసా కేంద్రాల లక్ష్యం. డీఎపీ,పొటాష్ కొరత దేశవ్యాప్తంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఎరువుల ఉత్పత్తి తగ్గింది. రాష్ట్రంలో బఫర్ స్టాక్ మెయిన్ టెన్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదు అని తెలిపారు.

ఇక రాష్ట్రంలో ఎక్కడా డీఎపీ,పొటాష్ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ప్రతి రైతు భరోసా కేంద్రం సబ్ డీలర్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. రాష్ట్రంలో 27చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీస్కున్నారు. నూజివీడు,అరకులో కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమూల్ అనేది కార్పేరేట్ సంస్థ కాదు…కో ఆపరేటివ్ ఫెడరేషన్. ప్రపంచంలో అత్యుత్తమ కో ఆపరేటివ్ ఫెడరేషన్ గా అమూల్ గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వంతో అమూల్ ఒప్పందం చేసుకుని కార్యకలాపాలు విస్తరిస్తోంది. అమూల్ కు పాలు పోయాలనడాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అమూల్ కోసం అవసరమైన చోట్ల ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటాం..దీనిలో తప్పేముంది అని పేర్కొన్నారు.

-Advertisement-రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు : మంత్రి కన్నబాబు

Related Articles

Latest Articles