బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు: మంత్రి జగదీశ్‌రెడ్డి


బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మట్లాడుతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ పెట్టిన ప్రెస్‌మీట్‌కు ప్రతిగా మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. బండికి కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ కు సోయిలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతులను మేము ప్రత్యామ్నాయ పంటల కోసం సిద్ధం చేస్తుంటే వరి కొంటారా.. లేదా వరి వేస్తే ఊరి అంటూ ప్రజలను రెచ్చగొట్టి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు రైతులకు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ర్టంలో ఉన్న బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారో చెప్పాలన్నారు. బండి సంజయ్‌ తెలంగాణ రైతులను డోలాయమనంలో పడేశారన్నారు.బండి సంజయ్ వ్యవసాయం తెలియని అజ్ఞాని అని ఆయన అన్నారు. బాయిల్డ్‌ రైస్‌పై కేంద్రం క్లారీటి ఇవ్వాలి. వరిపెట్టాల వద్దా పెడితే ఏ రకం పెట్టాలో కేంద్రం చెప్పాలన్నారు. ఇ్పటికైనా కేంద్రం రైతుల గురించి ఆలోచింఆచాలన్నారు.

క్షణికమైన ఆనందం కోసం ఏమైనా అనొచ్చు.. కానీ నేను అలా అనను.. ఎందుకంటే మేము రైతుల పక్షపాతులమన్నారు. ఆరో పణలు చేయాలంటే ఎన్నైనా చేయోచ్చని కానీ సమస్యకు పరిష్కారం చూపెట్టడమే ముఖ్యమన్నారు. సూటిగా రైతాంగం తరపును అడుగు తున్నాం ధాన్యం కొనుగోలు తేల్చాల్సింది ఫిబ్రవరిలో కాదు, ఇప్పుడే తేల్చాలని జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఈ సమస్యను సృష్టించింది ఇక్కడి బీజేపీ నేతలే.. దీనికి పరిష్కారం కూడా వారే చెబితే బాగుంటుం దన్నారు. రైతులను ఎటు కాకుండా అయోమయం లో బీజేపీ నేతలు పడేశారని ఆయన అన్నారు. ఇప్పటి కైనా కేంద్రం స్పష్టమైన వైఖరి ఏంటో తెలియజేయాలని, తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయో ద్దని బండి సంజయ్‌కు దమ్ము ఉంటే కేంద్రంతో కొట్లాడాలే కానీ విద్వేశాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడొద్దిని జగదీశ్‌ రెడ్డి విమర్శించారు.

Related Articles

Latest Articles