తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేదు…

తెలంగాణలో విద్యుత్ సంక్షోభం పై వస్తున్న వార్తలు అర్థ రహితం ఎన్టీవీతో మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం కూడా తెలంగాణలో పవర్ కట్ అవదు. రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు తెలంగాణ లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీనిపై దేశాన్ని పాలిస్తున్న నేతలు సమాధానం చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసాం అని చెప్పిన ఆయన హైడల్ పవర్ ఉత్పత్తి కూడా బాగుంది అన్నారు. శ్రీశైలం, సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుంది. గత ఏడాది 16 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటే ఏర్పాటు చేసింది తెలంగాణ అని గుర్తు చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వ ఇష్ట రీతిన నిర్ణయాల రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

-Advertisement-తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేదు...

Related Articles

Latest Articles