జూన్ 3 వరకు సూపర్ స్పైడర్లందరికి వ్యాక్సీన్ హరీష్ రావుకు కేసీఆర్ ఆదేశాలు.!

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బి.ఆర్‌.కె.ఆర్ భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021 జూన్ 3వ తేదీ నుండి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జి.హెచ్‌.ఎం.సి ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు 10,000 మందికి టీకాలు వేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన వ్యాక్సిన్ కోటా, అందిన వ్యాక్సిన్, అందుబాటులో వున్న వ్యాక్సిన్ నిల్వల గురించి మంత్రి సమీక్షించారు. రాష్ట్రానికి ఎక్కువ వ్యాక్సిన్ మోతాదులను కేటాయించుటకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. వైద్య పరికరాలను (Medical Equipment) సేకరించడం, ఆక్సిజన్ సరఫరా, స్టోరేజ్ యూనిట్ల ఏర్పాట్లు, 3 వ వేవ్ కోవిడ్ -19 ప్రభావం నివారణ చర్యలపై అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్షించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-