ప్రైవేట్ ఉపాధ్యాయులకు డబుల్ బెడ్రూం ఇళ్లు : హరీష్ రావు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న, ఎంతటి స్థాయి కి ఎదిగిన గురువు గుర్తుకు వస్తారు. ఉపాధ్యాయ ఎంఎల్ సి అని గురువులు చట్టసభల్లో ఉండాలని పెట్టుకున్నాం. విద్య ఉద్యోగం కోసం కాదు, ఉన్నతమైన గౌరవం కోసం అని తెలిపారు.

ప్రస్తుతం కంటికి కనబడని సూక్ష్మ జీవి ప్రపంచాన్ని గడగడలాడించింది. కరోనా వ్యాధి అన్ని రంగాలను దెబ్బ తీసింది. రెక్కాడితే డొక్కాడని వారు ప్రయివేట్ ఉపాధ్యాయులు. పోయిన నెల ఆగిన కరోన జీతభత్యం రిలీస్ చేస్తాం. జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నవో ఆ జిల్లాల వారికే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం చేపడుతోంది. జోనల్ విధానంలో మార్పులు చేర్పులు జరుగుతున్నవి, ఉద్యోగాల భర్తీలో ఆలస్యం అవుతుంది. విద్య ,వైద్య వ్యవస్థను పటిష్టం చేద్దాం. ఒక్కో జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు దిశగా ప్రభుత్వ ప్రవేశపెడుతుంది. ఏ ఏ రంగాల విద్యకు ఆయా రంగాల నుండి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం. విద్యకు ఖర్చు పెట్టట్లేదు అనుకోవద్దు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు డబుల్ బెడ్రూం లు కల్పిస్తాం. గ్యాస్ సిలిండర్,డిసిల్,పెట్రోల్ ధర పెంచిన బీజేపీ… పెద్దనోట్ల రద్దు అని.. చాలా డబ్బు బయటికి వస్తది అన్నారు. ఏది అదంతా అని అడిగారు. ఇక మీ ప్రజల ఆశీర్వాదం ఉంటే ఇంకా అభివృద్ధిలో ముందుకు వెలుదాం అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-