హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు : హరీష్ రావు

ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పన్ను 291 రూపాయలు రద్దు చేయచ్చు అని అన్న ఈటెలపై చర్చకు సవాల్ విసిరిన స్పందించలేదు గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను లేదు,అది కేంద్ర ప్రభుత్వ జిఎస్టి పరిధిలోకి వెళ్ళింది అని తెలిపారు. ఈ రోజు కమలపూర్ మండలం శంబుని పల్లి లో హరీష్ రావు మహిళలకు దొంగ చెక్కులు ఇచ్చాడంటూ మాట్లాడటం సబబు కాదు. మేము ఇచ్చిన మహిళా సంఘాల వడ్డీలేని రుణాల చెక్కులు పండుగ ముందే వచ్చినవి అంటున్నారు మహిళలు. పదే పదే టిఆర్ఎస్ మీద హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారు ఈటల రాజేందర్ అని చెప్పారు.

నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉందో రాజేందర్ మాటల్లో అంతే నిజమున్నట్లు ప్రచారం చేస్తున్నాడు. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు,ఆరు సార్లు గెలిపిస్తే ప్రజలపై ఈవిందంగా మాట్లాడుతు సబబు కాదు. మేము ఢిల్లీకి గులాం గిరి కాదు తెలంగాణ ప్రజలకు గులంగిరి గా ఉంటాం. సోషల్ మీడియా వేదికగా ఈటెల రాజేందర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. బీజేపీ పార్టీ కి కాదు,నన్ను చూసి ఓటు వేయండి అంటున్నారు తప్ప బీజేపీ తో అంటి ముట్టనట్లు ఉంటున్న ఈటెల రాజేందర్… బీజేపీ ప్రజలకు కేంద్రం ఎం చేసిందో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను మీరు సమర్ధిస్తున్నారా ఈటల్ రాజేందర్ అని అడిగారు. నేను మాత్రం గెలవాలి,నాకు మాత్రం పదవి కావాలనే ఆఖాంక్ష లో ఉన్నారు. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కరెంటు కోతలు ఉన్నవి,తెలంగాణలో కరెంట్ ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంది బొగ్గు నిల్వలు మళ్లించి కరెంటు కోతలు విధించినందుకు ఓటు వేయాల దేనికోసం ఓటు వేయాలి అని ప్రశ్నించారు. ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది,అభివృద్ధి చూసి ఓటు వేయండి అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles