ఆస్తులు కాపాడుకోవడానే ఈటల రాజీనామా : హరీష్ రావు

ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు అంటే ఆస్తులు కాపాడుకోడానికి అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా కమలాపూర్ మండలంలో ఆయన మాట్లాడుతూ… తెరాస పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా, బీజేపీ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది.బావుల కాడా మోటర్లకు మీటర్ల పెట్టమంటుంది,మార్కెట్ వ్యవస్థ రద్దు చేస్తా అంటుంది. కేసీఆర్ కుడి చేత్తో ఇస్తే,ఎడమ చేత్తో బీజేపీ గుంజుకుంటుంది. ఈనాడు ఈటల రాజేందర్ రైతుల ఉసురు పోసుకుంటున్న బీజేపీ పార్టీలోఏ నీతితో,నిజాయితీ తో చేరాడో చెప్పాలి.పెంచిన ధరలను తగ్గిస్తాం నాకు ఓటేయండి అని అడగడం లేదు ఎందుకు. ఇవన్నీ వద్దు కేవలం మైకులు పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ మరుగున పెట్టి మాట్లాడుతూ ఓట్లు అడుగుతున్నాడు. మాయమాటలు మొసలి కన్నీళ్లు కార్చే వాళ్ళు కావాలా, నీతి నిజాయితీ తో పనిచేసే వారు కావాలా… ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి గేళ్లు శ్రీనివాస్ ని గెలిపిస్తే 5000 డబుల్ బెడ్రూమ్ లు కట్టిస్తా అని మాటిస్తున్న అన్నారు. తెరాస పార్టీ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఓటేస్తారో, మాట్లాల కోతల బీజేపీ పార్టీకి ఓటేస్తారో చెప్పండి. గేళ్లు శ్రీనుకు ఓటేస్తే కన్నూరు గ్రామానికి 300&200 డబుల్ బెడ్రూమ్ లు కట్టిస్తాం అని తెలిపారు. ఈటల రాజేందర్ పాడుపడ్డ బీజేపీ భోందల పడి బొట్టు బిల్లలు ఇస్తా,చెత్తిర్లు ఇస్తా,గోడ గడియారాలు ఇస్తా,మ్యాకపోతులు ఇస్తా,కుట్టు మిషిన్లు ఇస్తా,మందు బాటిళ్లు ఇస్తా అని మాయ మాటలు చెప్తున్నాడు అని పేర్కొన్నారు.

-Advertisement-ఆస్తులు కాపాడుకోవడానే ఈటల రాజీనామా : హరీష్ రావు

Related Articles

Latest Articles