రైతుల కోసం సీఎం 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారు : హరీష్ రావు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు చెల్లింపులకు వీలుగా ముఖ్యమంత్రి 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు 24 గంటల్లో జమ చేయాలన్నదే  ధ్యేయం. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలి. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి. ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ కానీ వివరాలను వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలి. టార్ఫలిన్, గన్ని బ్యాగులు కొరత, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. అకాల వర్షాలు వల్ల పంట తడవకుండా అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల లో ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారి దే బాధ్యత అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-