పంజాబ్, ఏపీలను తలదన్నే విధంగా తెలంగాణలో ధాన్యం పండింది…

సిద్దిపేట జిల్లా… నంగునూర్ మండలం మగ్దుంపూర్ లో ఆయిల్ ఫామ్ సాగు ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్బంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగు పడతాయని చెప్పిన మాట నిజమైంది. కాళేశ్వరం జలాలతో తెలంగాణలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగింది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నే విధంగా తెలంగాణలో ధాన్యం పండింది అన్నారు. ప్రతి ఏటా మన దేశంలో 90 వేల కోట్ల పామాయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనిని నియంత్రించడంలో మన దేశం 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలి. పామాయిల్ కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉంది. అందరూ రైతులకు గిట్టుబాటు ధర అందించేలా.. అన్నీ రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు.

తెలంగాణ వ్యవసాయంలో సీఎం విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. తెలంగాణ రైతులను ఒకనాడు నవ్విన ఆంధ్రా పాలకులు.., నేడు మనల్ని చూసి ఈర్ష్య పడుతున్నారు. గతంలో మొగులుకు ముఖం పెట్టినా నీళ్లు వచ్చేవి కావు., కానీ నేడు ముఖం చూస్తే గలగలా గోదావరి జలాలు పారుతున్నాయ్. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఏనాడైనా రైతుల గురించి పట్టించుకున్నారా.. సాగునీటి గురించి ఆలోచించారా అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-