బూస్టర్‌ను డోస్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..

కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌లు వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్‌ డోస్‌ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. చార్నినార్‌లోని యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం మాస్క్, సానిటైజర్ లతో పాటూ వాక్సిన్ తీసుకోవాలన్నారు. వాక్సిన్ పై అపోహలు నమ్మొద్దని, అర్హులందరూ వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. యునాని ఆస్పత్రి చాలా పాతది అయిపోయిందని, వర్షం పడితే ఇబ్బందిగా ఉందని, యునాని ఆస్పత్రిలోని సమస్యలను మంత్రి హరీష్‌రావుకు వివరించానన్నారు.

Related Articles

Latest Articles