అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

కోఠి డీఎంఏ కార్యాలయంలో రూ. 1.41 కోట్ల విలువైన నాలుగు అంబులెన్సు వాహనాలను ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఇలాంటి అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని ఆయన పేర్కొన్నారు. నాలుగు అంబులెన్సుల వాహనాల్లో లైఫ్‌ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఇవి బోధన్‌ ఆస్పత్రిలో ఈ వాహనాలను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వం 108,104 ద్వారా అంబులెన్స్‌ సేవలను అందిస్తుందని తెలిపారు. వీటిలో పాడైపోయిన వాటి స్థానంలో కొత్త వాహానాలను తీసుకొస్తామన్నారు. రాష్ర్టంలో 429 108వాహనాలు ఉన్నాయని ఇవే కాకుండా ఇంకా కొత్త వాహనాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే హైద్రాబాద్‌లో నాలుగు ఆస్పత్రు లను అన్ని సౌకర్యాలతో తీసుకొచ్చేందుకు ప్రత్నిస్తున్నామన్నారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆస్పత్రుల్లో మెరుగైనా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

Related Articles

Latest Articles