కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుదాం : మంత్రి హరీష్ రావు

యాసంగి పంట కొంటారా…కొనరా… సీదా అడుగుతున్నాం అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండేది దొడ్డు వడ్లు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుదాం. పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి.. తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతా అని అడిగారు. రైతు చట్టాలు రద్దు రైతుల విజయం..రైతుల పోరాటం తో కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ రైతుల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్. రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా లో చేపట్టారు. రైతులు ఆందోళనల పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది. వాన కాలం వరి పంట తెలంగాణ ప్రభుత్వం కొంటుంది.. వడ్లు కొనేందుకే ఊరు ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles