ఈటలపై హరీష్‌రావు ఫైర్‌.. కేసీఆర్‌కు గోరి కడతావా..?

మాజీ మంత్రి, హుజురాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్‌రావు.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు ఎలా వస్తాయి? గెల్లు శీను గెలిస్తే వస్తాయా..? ఈటల గెలిస్తే వస్తాయా? ఒక్కసారి ఆలోచించాలన్నారు.. గెల్లు సీను గెలవడం ఖాయం ఇక్కడ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్న ఆయన.. గొంతు బిగ్గరగా చేసుకొని పెద్దగా మాట్లాడిన జూట మాటలు మాట్లాడిన ధర్మం ధర్మమే అవుతుందన్నారు.. గ్రామాలలో నన్ను చూసే ఇవన్నీ పనులు అవుతున్నాయని చెబుతున్నావు.. ఆనాడు రైతు బంధు ఎవరిని చూసి వచ్చింది, కల్యాణ లక్ష్మి ఎవరిని చూసి వచ్చింది చెప్పు రాజేంద్ర అంటూ ప్రశ్నించారు. నువ్వు పని చేయకనే హుజురాబాద్‌ వెనుకబడ్డది కనుకనే మిగిలిపోయేనవి పనులను మేం చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే నీవ్వు కేసీఆర్ కు గోరి కడతావా…? అంటూ ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌రావు.. తమ్ముడు, కుడిభుజం అన్న.. కేసీఆర్ ను తిడుతున్నాడు… ఫిర్యాదు చేసి బతుకమ్మ చీరెలు రాకుండా చేశారని మండిపడ్డారు. ఇక, వచ్చే ఫిబ్రవరి, మార్చి నాటికి రైతులకు మిత్తితో సహా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ రైతుబంధు కార్డు రైతు భీమా కార్డు ఇస్తే.. బీజేపీ వాళ్లు రైతులపై కార్లు ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నిన్నటి వరకు బీజేపీని తిట్టిన నువ్వు బీజేపీ వద్దంటివి కేసీఆర్‌ ముద్దంటివి.. ఇప్పుడు బీజేపీలో చేరి బీజేపీ ముద్దు అంటున్నావ్.. కేసీఆర్ కు గోరి కడుతా అంటున్నావు.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నావు.. ఎవరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది అంటూ నిలదీశారు హరీష్‌రావు.

-Advertisement-ఈటలపై హరీష్‌రావు ఫైర్‌.. కేసీఆర్‌కు గోరి కడతావా..?

Related Articles

Latest Articles