ఓట్లు అడిగే హక్కు టీఆరెఎస్ కే ఉంది…

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు బీజేపీ నాయకులు కార్యకర్తలు. అక్కడ గంగుల కమలాకర్ మాట్లాడుతూ… రాష్ట్రం లో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కే ఉంది. బీజేపీ పార్టీ లో పని చేసే వాళ్ళను బయటికి వెళ్లగొట్టరు. విశ్వసనీయతకు వెన్నుపోటు కు మధ్యల జరిగే ఎన్నికలు ఇవి అన్నారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ రోజురోజకీ హుజూరాబాద్ లో ఆదరణ పెరుగుతుంది. ఈటల రాజేందర్ గారి మోసానికి గేల్లు శ్రీనివాస్ విశ్వసనీయతకు మధ్యలో జరుగుతున్న పోటీ. బిజెపి వాళ్ళే ఫ్యుజ్ తీసేసి టీఆరెఎస్ వాళ్ళు తీసేశారని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కు ప్రభుత్వం రక్షణ కలిగిస్తుంది. హుజూరాబాద్ లో అభివృద్ది చేసిన అని చెప్పుకునే పరిస్థితి లేదు అందుకే సెంటిమెంట్ ను రగులుస్తున్నరు. గ్యాస్ ధర పెరిగింది సబ్సిడీ తీసేసింది బిజెపి ప్రభుత్వం. ఈటల రాజేందర్ కు ఎం చెప్పాలో అర్థం కాక అబద్ధాలు మాట్లాడి ఓట్లు సంపందించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ది కావాలంటే గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి. ఐదు నెలల కింద బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టలు రద్దు చేయమని చెప్పి ఇప్పుడు ఎలా బిజెపి చేరినవు. ఐదు నెలల కింద బిజెపి పార్టీ నీ విమర్శించిన ఈటల రాజేందర్ వీడియోలు బయటికి తిస్త అని తెలిపారు.

ఇక మేము హుజూరాబాద్ వచ్చి అభివృద్ది చేస్తున్నాం కేంద్ర మంత్రులు వచ్చి ఖాళీ చేతులతో వెళుతున్నారు. బిసి ల జనగణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిండు సిఎం కేసీఅర్. బిజెపి లో కష్టపడి పని చేసిన నాయకులనే కాపాడుకోలేని. ఈటల రాజేందర్ ప్రజలను ఎలా కాపాడుకుంటరు. గేల్లు శ్రీనివాస్ గెలిచిన తరువాత హుజూరాబాద్ కు వచ్చి ఇచ్చిన హామీలు పూర్తయ్యే విధంగా పని చేస్తున్నాం. ఈటల రాజేందర్ మాట్లాడే మాటల్లో నీతి నిజాయితీ ఉందా హుజూరాబాద్ ప్రజలు అలోచించండి అని పేర్కొన్నారు.

-Advertisement-ఓట్లు అడిగే హక్కు టీఆరెఎస్ కే ఉంది...

Related Articles

Latest Articles