ఈటల రాజేందర్ కు మంత్రి హరీష్ రావు సవాల్

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక తేదీ తరుముకొస్తున్న నేపథ్యం లో… నేతల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. అయితే.. తాజాగా హన్మకొండ జిల్లా పెంచికలపేట సభలో ఈటల రాజేందర్‌ కు సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు. గ్యాస్ సిలిండర్ ధర లో 291 రూపాయలు రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు మంత్రి హరీష్‌ రావు. 291 రూపాయలు రాష్ట్ర పన్ను లేదని తెలిస్తే ఎన్నికల నుండి తప్పు కుంటావా ? అని ప్రశ్నించారు హరీష్ రావు. రేపు రావాలా ? ఈరోజు రావాలా ? జమ్మికుంటలో అయినా సరే… హుజురాబాద్ లో అయినా సరే చర్చకు సిద్ధం అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. అయితే.. మంత్రి హరీష్‌ రావు చేసిన తాజా సవాల్‌.. టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

-Advertisement-ఈటల రాజేందర్ కు  మంత్రి హరీష్ రావు  సవాల్

Related Articles

Latest Articles