పల్లె దవాఖానలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన మంత్రి హరీష్ రావు

పల్లె దవాఖానలు నాలుగు వేలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పల్లె దవాఖానలతో గ్రామీణుల చెంతనే నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 5 మెడికల్ కాలేజీలను 17కు పెంచుకుంటున్నాము అని చెప్పారు. పీజీ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లను గణనీయంగా పెంచుకున్నాము అని చెప్పిన ఆయన… గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల వైద్య సేవలు పెంచేందుకు పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల పేదలు, రోగాలు చేయి దాటిన స్థితిలో ఆసుపత్రికి వస్తున్నారు. కానీ, పల్లె దవాఖానల వల్ల షుగర్, బీపీ వ్యాధి ముందే గుర్తిస్తే వ్యాధి ముదిరే పరిస్థితుల నుండి తప్పించుకోవచ్చు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Related Articles

Latest Articles