కలెక్టర్ లకు జీతాలు రాకపోయినా రైతు బంధు ఆపలేదు..

గతం లో సాగు నీటి కోసం,కరెంట్ కోసం రాష్ట్రం లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ నేడు కేసీఆర్ ప్రభుత్వం లో అటువంటి సమస్యలు లేవు. 24 గంటల కరెంట్ రైతులకు అందుబాటులో ఉంటుంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నెలకు 12 లక్షల రూపాయలను రైతుల పేరు మీద ఎలక్ట్రిసిటీ కి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. బ్యాంక్ ల నుండి అప్పు తీసుకుని రాష్ట్రంలో రైతాంగం పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసింది. పంట కొనుగోళ్ల పై కాంగ్రెస్,బీజేపీ వారు ధర్నాలు చేశారు. అల ధర్నాలు చేసే పార్టీలను రైతులు ప్రశ్నించాలి అన్నారు.

ఇక మంత్రులకు, కలెక్టర్ లకు జీతాలు రాకపోయినా రైతు బందును మాత్రం కేసీఆర్ ఆపలేదు. కరోనా ఇబ్బందుల్లో కూడా పెన్షన్ ఇవ్వటం ఆగలేదు. ఏ రాష్ట్రం లో లేని విధం గా కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకాలతో తెలంగాణ రాష్ట్ర ఆడ బిడ్డలకు కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలను ఆహ్లాదకరం గా ఏర్పాటు చేయటం తో కేసీఆర్ పోన్ చేసి అభినందించారు. మండలానికి ఒక్కో గ్రామం చొప్పున పల్లె ప్రకృతి వనం ను అందంగా తీర్చి దిద్దిన గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామానికి10 లక్షల రూపాయలను సీసీ రోడ్ల ఏర్పాటు కు మంజూరు చేస్తాం. కేంద్రం శాలువా లతో సత్కరించటం తప్ప నిధులు మంజూరు చేయటం లేదు అని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-