అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది చెంద‌దు: బుగ్గ‌న‌…

సీఆర్డీఏ ర‌ద్దు ఉప‌సంహ‌ర‌ణ బిల్లును మంత్రి బుగ్గ‌న ఏపీ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు.  అభివృద్ది వికేంద్రీకర‌ణ జ‌ర‌గాల‌ని శివ‌రామకృష్ణ‌న్ క‌మిటీ సూచించింద‌ని మంత్రి బుగ్గ‌న అన్నారు. అమ‌రావ‌తి ప్రాంతం సార‌వంత‌మైన‌, ఖ‌రీదైన భూమి అని, దాన్ని వృధా చేయ‌వ‌ద్ద‌ని క‌మిటీ స్ప‌ష్టంగా చెప్పింద‌ని అన్నారు.  బీహెచ్ఈఎల్ వంటి పెద్ద సంస్థ‌లు వ‌స్తే ప్ర‌వేట్ సంస్థ‌లు వ‌స్తాయ‌ని, ఏ రాష్ట్ర‌మైనా వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్య‌త ఇచ్చాయ‌ని అన్నారు.  

Read: అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ వాయిదా…

ఒకేచోట అన్నిసంస్థ‌లు పెడితే ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెంద‌ద‌ని బుగ్గ‌న అన్నారు.  అన్నిప్రాంతాలు స‌మానంగా అభివృద్ది చెందాన‌ల‌న్న‌ది త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని, గ‌త ప్ర‌భుత్వం ముంబై కంటే గొప్ప న‌గ‌రం నిర్మిస్తామ‌ని గొప్ప‌ల‌కు పోయింద‌ని అన్నారు.  భవిష్య‌త్ పై ఆలోచ‌న లేకుండా ఊహాజ‌నితంగా రాజ‌ధానిని నిర్ణ‌యించారని బుగ్గ‌న పేర్కొన్నారు. 

Related Articles

Latest Articles