తప్పకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం…

ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన మేనిఫెస్టో లో ప్రతి అంశాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టో లో ఇచ్చి హామీల్లో నూటికి 94శాతం హామీలు సీఎం నెరవేర్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి లబ్దిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేశారు. 2ఏళ్ల పాలనపై సీఎం విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి లబ్ది దారుడికి పంపిస్తాం. సంక్షేమం అభివృద్దిని రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోంది. వైఎస్ ఆర్ స్పూర్తితో సంక్షేమ ,అభివృద్ది పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల ఆలోచనలను వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారు. ఇచ్చిన ప్రతి మాటను సీఎం నెరవేర్చారు. ప్రజలు తమ ఆశీస్సులను సీఎం జగన్ కు అందించాలి అన్నారు.

ఇక లోకేష్ ఆరోపనణలన్నీ పిచ్చి మాటలు అని తెపిన బొత్స సీఎం జగన్ ఇచ్చిన మాట ఏది తప్పారో లోకేష్ నిరూపించాలి అని పేర్కొన్నారు. లోకేష్ లేని పోని అవాకులు చవాకులు పేల్చుతున్నారు. లోకేష్ ఓ పిల్ల కాకి. తెదేపా నేతలు చెబుతోన్న అరాచకం ఏమిటో చెప్పాలి. తెదేపా నేతలు విడుదల చేసినవి పనికి మాలిన చార్జిషీట్లు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే మా ప్రభుత్వం విధానం. అందుకే మూడు రాజధానులను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నాం. తప్పకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం అని స్పష్టం చేసారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-