శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అవంతి శ్రీనివాస్‌

విశాఖ సముద్రతీరంలో మరసారి రింగు వలల వివాదం తెరపైకి వచ్చింది. పెద్దజాలరిపేట, చిన్న జాలరి పేట మత్స్యకారుల మధ్య వివాదం జరగగా రింగు వలలతో వేటకు వెళ్లిన మత్స్యకారులను మరో వర్గం మత్స్యకారులను అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ విషయం పెద్ద చర్చ నడుస్తుంది. తమ బోట్లకు నిప్పుపెట్టారని మరో వర్గానికి చెందిన మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌.. మాట్లాడుతూ.. బోటు దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారుల మధ్య గొడవ చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.రెండు రోజుల్లో ఇరువర్గాల మత్స్యకారుల పెద్దలతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. అన్నతమ్ముళ్లల కలిసి వేటను కొనసాగించాల్సిన వారి మధ్య కొంతమంది స్వలాభం కోసం చిచ్చు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు.

Read Also: అమరావతిలో నిర్మాణాలపై సీఆర్డీయే ఫోకస్

సీఎం జగన్ మత్స్యకారులకు భరోసా కింద నాలుగు వేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. మత్స్య కారుల మధ్య తలెత్తిన సమస్యను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. డిపార్ట్‌మెంట్‌ల మధ్య కొన్ని లోపాలు ఉంటాయి. గ్రౌండ్‌లెవల్‌లో పోలీసులు, మెరైన్‌ పోలీసులు చూస్తున్నారు. వారిద్దరూ కో ఆర్డినేష్‌ చేసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే మత్స్యకార గ్రామాల పరిస్థితిని హెలికాప్టర్‌ల ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు.

Related Articles

Latest Articles