వైసీపీలో వర్గపోరు..మంత్రి అవంతి వర్సెస్ ఎమ్మెల్యే కన్నబాబు

విశాఖ జిల్లా వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కన్నబాబు రాజుల మధ్మ మాటల యుద్ధం నడిచింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి అవంతి, ఎమ్మెల్యే కన్నబాబు మధ్య మాటకు మాట చోటుచేసుకుంది. వేదికపైకి ZP వైస్ ఛైర్మన్ లను స్వాగతించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రొటోకాల్‌ లో అలాంటి స౦ప్రదాయ౦ లేద౦టూ అభ్య౦తర౦ తెలిపారు MLA కన్నబాబు రాజు. తాను మాట్లాడిన తర్వాత అభ్య౦తర౦ ఉంటే మాట్లాడాలన్నారు మంత్రి. ప్రొటోకాల్ ని ఫాలో అవ్వరు అ౦టే తాను సమావేశం నుండి వెళ్ళిపోతానన్నారు కన్నబాబు రాజు. వైస్ ఛైర్మన్ లకు వేదికపైకి అవకాశం లేదంటూ అధికారులు చెప్పడంతో వెనక్కి తగ్గారు మంత్రి అవంతి.

Related Articles

Latest Articles