అచ్చెన్నాయుడికి మంత్రి అనిల్ కుమార్ కౌంటర్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ‘మమ్మల్ని రాజీనామా చేసి రమ్మంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏం పీకారు. దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవండి చూద్దాం. 19 మందిలో మీకు సింగిల్ డిజిట్ వస్తే మేం రాజీనామా చేస్తాం’ అని సవాల్ విసిరారు. ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు.

Read Also: ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన కుప్పం ఫలితం !

టీడీపీని తెలంగాణ ప్రజలతో పాటు ఏపీ ప్రజలు కూడా మరిచిపోయారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని.. ఆ పథకాలే తమను గెలిపించాయని మంత్రి అనిల్ తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.

Related Articles

Latest Articles