ప్రతిపక్షం ఇంట్లో కూర్చొని విషప్రచారం చేస్తుంది : మంత్రి అనిల్

నెల్లూరులో కలెక్టర్ భవనంలో మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శేఖ మంత్రి అనీల్ మరియు జిల్లా కలెక్టర్ ,జిల్లా SP సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కొరత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ… నేను, మేకపాటి ఈ మధ్య కరోనా నుండి కొలుకున్నాం. జిల్లలో ప్రతిపక్షం ఇంట్లో కూర్చొని కరోనా పై మాట్లాడటం విడ్డురంగా ఉంది. జిల్లాలో ఆక్సిజన్ , బెడ్లు కొరతలేవు. ప్రతిపక్షాలు ప్రభుత్వం పై కావాలని విషప్రచారాన్ని చేస్తున్నారు. రేమిడిసివర్ దొరకడం లేదు బ్లాక్ అమ్ముతున్నారు అని విషప్రచారం చేపట్టారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఎలాంటి విపత్తు జరిగిన ఎదురుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి చెప్పిన 18 నెలల్లో 81 కోట్లు ఖర్చు చేసాం… ఆక్సిజన్ కోసం 1600 కోట్లు ఖర్చు చైలేమ అని ప్రశ్నించారు. కరోనా వల్ల 10ఏళ్ళు నాతో ఉండిన కార్యకర్తను కాపాడుకోలేకపోయా. ఒక వైపు కరోనాతో ప్రజలు బాధపడుతుంటే వారిని ఆసరాగా చేసుకుని ఇంకా భయపడతారా..? ప్రజలకు ధైర్యం చెప్పండి అంతేగాని మాటలతో భయపెట్టి చంపకండి అని మంత్రి అనిల్ అన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-