ఏలూరు హాస్పిటల్ లోని పరిస్థితుల పై మంత్రి ఆళ్ల నాని సీరియస్…

ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణ పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  సీరియస్ అయ్యారు. అంబులెన్సులో కరోనా బాధితులకు ఆక్సిజన్ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని నియమించారు. పూర్తిగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి అక్కడే మకాం వేయాలని అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు ఇచ్చారు. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు 300బెడ్స్ కేటాయించింది జిల్లా యంత్రాంగం. అంబులెన్సు లో వచ్చిన కరోనా పెషేంట్స్ కు వెంటనే హాస్పిటల్ లో వైద్య సదుపాయం కల్పించాలని DCHS డాక్టర్ AVR మోహన్ ను ఆదేశించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.

Related Articles

Latest Articles

-Advertisement-